![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:33 PM
రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన వెబ్ సిరీస్ 'ఓం కాళీ జై కాళీ'. రాము చెల్లప్ప దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 5 ఎపిసోడ్స్ గా నిర్మితమైంది. విమల్ .. క్వీన్సీ .. పావనీ రెడ్డి .. దివ్య దొరైస్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సిరీస్ తమిళంల్తో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ .. బెంగాలి .. మరాఠీ భాషలలోను అందుబాటులోకి వచ్చింది. అలాంటి ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అది ఒక విలేజ్ .. అక్కడ ప్రతి ఏడాది దసరాకి కాళీమాత 'జాతర' జరుగుతూ ఉంటుంది. తమ కోరికలు నెరవేరాలనుకునేవారు అమ్మవారి వేషం ధరించి ఆడటమనేది అక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారం. ఓ సారి అమ్మవారి జాతర జరుగుతూ ఉండగా, గర్భవతిగా ఉన్న ఒక యువతి ప్రాణభయంతో పరుగెత్తుకుంటూ ఆ గ్రామంలోకి ప్రవేశిస్తుంది. గ్రామస్తులంతా కూడా ఆమెను తమ ఆడపడచుగా భావించి, ఆమె ఆశ్రయం కల్పిస్తారు. తనకి తెలిసిన మూలికా వైద్యం చేస్తూ ఆ యువతి అక్కడే ఉండిపోతుంది .. ఆమె పేరే నీల.ఆ గ్రామంలో గణేశ్ (విమల్) అనే యువకుడికి మంచి పేరు ఉంటుంది. అదే గ్రామానికి చెందిన యువతి (పావనీ రెడ్డి) అతణ్ణి ఇష్టపడుతూ ఉంటుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇది అలా ఉంటే వేరే గ్రామానికి చెందిన రాజకీయనాయకుడిగా భరణి ఉంటాడు. అతని దగ్గర ప్రధానమైన అనుచరులుగా రాజదొరై .. ఏజీ పనిచేస్తుంటారు. వాళ్లిద్దరూ కూడా 'నీల' కోసం చుట్టుపక్కల గ్రామాలన్నీ గాలిస్తూ ఉంటారు. ఆమెను చంపేయమని అనుచరులను పంపిస్తూ ఉంటారు. 'నీల' ఓ ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఆ ఆడపిల్లకు ఐదేళ్లు వచ్చినా 'నీల'పై ఏదో ఒక సందర్భంలో దాడులు జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్న దాడులకు కారకులు ఎవరని గణేశ్ బృందానికి సందేహం కలుగుతుంది. తనని చంపడానికి ప్రయత్నించేది తన అన్నయ్యలేనని ఆమె చెప్పడంతో వాళ్లంతా కూడా ఆశ్చర్యపోతారు. సొంత చెల్లెలిని చంపడానికి వాళ్లు ప్రయత్నించడానికి కారణం ఏమిటి? ప్రేమించిన యువతితో గణేశ్ వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ.
Latest News