![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 03:27 PM
ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లపతా లేడీస్’ సినిమాపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా ‘బుర్ఖా సిటీ’ అనే అరబిక్ చిత్రాన్ని కాపీ కొట్టి తీశారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ‘మీది ఒరిజినల్ సినిమా కాదా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘లపతా లేడీస్’ మూవీకి కిరణ్ రావు దర్శకత్వం వహించగా.. భారత్ తరపున ఆస్కార్‌కు అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే.అయితే గతంలోనూ లపతా లేడీస్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఘున్‌ఘట్ కే పాట్ ఖోల్ (1999)మూవీతో లపతా లేడీస్‌కు పోలికలు ఉన్నాయని అనంత్ మహదేవన్ ఆరోపించారు. రైల్వే స్టేషన్‌లో వధువులు మారిపోవడం సీన్‌ను తన చిత్రంలో నుంచి కాపీ కొట్టారని అన్నారు.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 1, 2024న థియేటర్లలో విడుదలైన లపతా లేడీస్.. 2001లో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా మారిన ఇద్దరు వధువుల కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించారు.
Latest News