![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 03:20 PM
హెచ్ సియులో జరుగుతున్న ఘటనపై యాంకర్ రష్మీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. తను రాజకీయాల కోసం ఈ వీడియో చేయటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి వ్యతిరేకంగా కూడా ఈ వీడియో తను చేయటం లేదని పేర్కొన్నారు.అయితే ఈ సందర్బంగా యాంకర్ రష్మీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తను అపార్ట్మెంట్ లో కూర్చుని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానని..కానీ గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు, ఎన్ని చెట్లు తొలగింపబడ్డాయో తనకు తెలుసని పేర్కొన్నారు.తనకు ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసన్నారు. కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే పక్షులు నెమళ్ళు చాలా సఫర్ అవుతున్నాయని వాపోయారు. అలాగే రాబోయేది అత్యంత వేసవికాలం.. అందులో పక్షులు ,నెమళ్లు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలన్నారు. జంతువులను రీహబిలైట్ చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కోరారు. అలాగే ప్రభుత్వం పాజిటివ్ స్టెప్స్ తో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు యాంకర్ రష్మీ తెలిపారు.
నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. కానీ..: జబర్దస్త్ యాంకర్ రష్మీ #RashmiGautam #HyderabadCentralUniversity #RevanthReddy #hcubiodiversity pic.twitter.com/QZotjGdlDs
— Billa Gangadhar (@billa_gangadhar) April 2, 2025