![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 03:36 PM
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయానికి హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలను ఉద్రితం చేస్తున్నారు. భూముల అమ్మకాలను సర్కారు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 400 ఎకరాల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.నాలుగు వందల ఎకరాలను యూనివర్సిటీకి అప్పగించాలని.. దీనిపై ప్రకటన చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే బుధవారం విద్యార్థి జేఏపీ (JAP) ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు భారీ ర్యాలీ కొనసాగించగా.. అప్పుడే పోలీసుల రాకతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ ఇష్యూపై చాలా మంది రాజకీయ నాయకులు అండ్ సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెర హాట్ యాంకర్, వెండితెర అద్భుత నటి అనసూయ సోషల్ మీడియా వేదికన స్పందించి.. ఓ వీడియో పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ‘ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్’ అంటూ రాసుకొచ్చింది. అడవి, అడవిలోని ‘పచ్చని అడవి పూడ్చివేసే రోజు వచ్చింది. ఎరుపు రంగులో ఉన్న చెట్లు నేలకూలాయి’ అంటూ వీడియో ఉంది. ప్రస్తుతం అనసూయ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News