![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:34 AM
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎల్ 2 ఎంపురాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. మార్చి 27న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ భారీ వసూళ్ల పట్ల చిత్ర నిర్మాణ సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించారనే విమర్శలు, వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, సినిమాకు కలెక్షన్లు పెరుగుతుండటం విశేషం. ఇప్పటివరకు 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా పేరిట ఉన్న రూ.200 కోట్ల రికార్డును ఈ చిత్రం అధిగమించింది. ఈ సినిమాకు కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Latest News