![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:23 PM
యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో హీరోగా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీ పర్వాలేదనిపించగా... ఇప్పుడు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే రెండో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.ట్రైలర్ చూస్తుంటే ఓ సివిల్ ఇంజనీర్ ఒక పల్లెటూరికి ఓ ప్రాజెక్టు పని మీద వెళతాడు. అక్కడ తాపీ పని వాళ్లతో, ఆ ఊరి వాళ్లతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది చూపించారు. అలాగే ఆ ఊర్లో ఒకే ఒక్క అమ్మాయి ఉండటం, ఆ అమ్మాయితో హీరోకి లవ్, పెళ్లి వంటి ఆసక్తికర కథనంతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.జబర్దస్త్ కామెడీ షోతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్, భరత్‌ల దర్శకత్వంలో, మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ప్రదీప్ సరసన దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించారు. రధన్ సంగీతం అందించారు.
Latest News