![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 08:25 PM
అలనాటి అందాల తార త్రిష .. 40+ ఏళ్ల వయస్సులో కూడా తన అందాలతో కుర్రహీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. అంతే కాకుండా ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' ఒకటి. ఇదిలా ఉంటే.. ఓ పక్కా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.తన ప్రోషినల్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు.. వ్యక్తిగతంగతమైన అంశాలు కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన X అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. 'ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది' అంటూ ఓ క్యూట్ ఫొటో షేర్ చేసింది. ప్రజెంట్ ఈ ఫొటో వైరల్ అవుతుండగా.. 'ఎంగేజ్‌మెంట్ చేసుకున్నావా', 'సూపర్ క్యూట్' ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Latest News