![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 10:54 AM
టాలీవుడ్ డైరెక్టర్ మెహెర్ రమేష్ సోదరి సత్యవతి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి తనకు కూడా సోదరిలాంటిదేనని చిరంజీవి పేర్కొన్నారు. ఆమె మృతి చెందడం తనను ఎంతో కలిచి వేసిందని చిరంజీవి వెల్లడించారు. మెహెర్ రమేష్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
Latest News