డిఫరెంట్ పోజులతో రకుల్ హొయలు !
by Suryaa Desk |
Sat, Mar 29, 2025, 08:36 PM
ఒకప్పటి తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. ఇవి ఆమె బెడ్ రూమ్‌లోని ఫోటోలు కావడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ ఇలా బెడ్‌పై ఉన్న పిక్స్ పంచుకోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ తన బెడ్‌రూమ్ ఫొటోలకు క్యాప్షన్ ఇస్తూ, నవ్వడం కూడా జీవితానికి ఒక మార్గం అని రాసింది. ఇందులో డిఫరెంట్ పోజులో దిగిన ఫోటోలను పంచుకుంది. అవి ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. రకుల్ తన ఈ ఫొటోలలో దుస్తుల కోసం వర్సాచే జీన్స్, ది కలెక్టివ్, వర్సాచేకు క్రెడిట్ ఇచ్చింది. ఓ రకంగా వాటిని రకుల్ ప్రమోట్ చేస్తుందని చెప్పొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు చూసి నెటిజన్లు ఆమెను బాగా ఆటపట్టిస్తున్నారు. ఒక యూజర్ ఆమె భర్త గురించి షాకిచ్చే ప్రశ్నలను అడిగారు. ఒక యూజర్ రాస్తూ, మీ భర్త సెలబ్రిటీ డేటింగ్ యాప్‌లో ఉన్నాడని మీకు తెలుసా? అని అడిగాడు. మరొక యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.కొందరు ట్రోల్ చేసేవాళ్లను వదిలేస్తే, చాలా మంది రకుల్ ప్రీత్ సింగ్‌ను పొగుడుతున్నారు. తమ ప్రేమను కురిపిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్‌తో కలిసి 'మేరే హస్బెండ్ కి బీవీ'లో కనిపించింది. ప్రస్తుతం ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తుంది రకుల్. తెలుగులో ఆమె నటించి నాలుగేళ్లు అవుతుంది. `కొండపొలం` చివరి మూవీ. ఆ తర్వాత టాలీవుడ్‌లో మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.



Latest News