![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 08:31 PM
ప్రభాస్‌కి పెళ్లంట. ఆ అమ్మాయి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తె అంట. చాలా రోజల తరువాత మన డార్లింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడోచ్ అంటూ సోషల్ మీడియాలో ఒకటే దంపుడు. అయితే వీటన్నింటిపై ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. “ఈ వార్తలు పూర్తిగా ఫేక్. దయచేసి అలాంటి రూమర్లను నమ్మవద్దు,” అంటూ ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. అంతేకాకుండా, హైదరాబాద్ టీమ్ నుంచీ అదే విషయాన్ని ధ్రువీకరించారు. దీనితో పాటు, కొద్ది రోజుల క్రితం భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారన్న రూమర్‌ను కూడా కొట్టిపారేశారు. గతంలో అనుష్క శెట్టి, కృతి సనన్ లాంటి కథానాయికలతో సంబంధం ఉందన్న వార్తలపై కూడా ప్రభాస్ స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు. ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్టులు వరుసగా లైన్‌లో ఉన్నాయి. ఒక్కో సినిమా బడ్జెట్ 300 కోట్ల పైనే ఉండడంతో, ఈ ప్రాజెక్టులపై ప్రభాస్ పూర్తిగా ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పట్లో ఆయన వ్యక్తిగత జీవితానికి బ్రేక్ ఇచ్చేలా కనపడడం లేదు. ఈ సినిమాల్లోని పాత్రలు, గెటప్స్, కథల డిమాండ్ వల్ల ఏ ఒక్క సినిమాకు సమయం ఇవ్వడమే కాదు, ప్రమోషన్స్ కూడా పెద్ద సవాలుగా మారింది.
Latest News