![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 05:42 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. అబద్ధాల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కేటాయింపులకు, ఆచరణకు పొంతన లేని బడ్జెట్ ఇది అని విమర్శించారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇదొక అసమర్థ ప్రభుత్వమని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదని ఆయన అన్నారు. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని బండి సంజయ్ పెదవి విరిచారు.