![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:33 PM
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు స్పాట్‌లోనే ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.మహంకాళి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బన్సీలాల్ పేటకు చెందిన బన్సీలాల్ పేట్ ప్రాంతానికి చెందిన ప్రణయ్(18) హర్షిత్ (21) జీహెచ్ఎంసీ వేస్ట్ కంట్రోల్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసి స్పోర్ట్స్ బైక్‌పై ఉదయం 5 గంటల ప్రాంతంలో మహంకాళి పీఎస్ పరిధిలోని ఎస్డీ రోడ్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్ చౌరస్తా వద్ద అతివేగంగా స్విఫ్ట్ డిజైర్ కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో సీసీ నగర్‌కు చెందిన ప్రణయ్ స్పాట్లోనే చనిపోగా, హర్షిత్‌ను గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపో పోయినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.