|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 10:35 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఐదు రోజుల్లోనే రూ.940 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి లిఫ్ట్ అయింది. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో జోరుగా దావత్‌లు నడుస్తుండటంతో లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ వైపే మందుబాబులు మొగ్గు చూపుతున్నారు. డిసెంబర్ 2న రూ.207.49 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపించింది.