|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 02:31 PM
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని టూ టౌన్ ఎస్సై ఎర్రం సైదులుకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఎన్నికల అధికారికి కూడా సమర్పించిందని ఆయన పేర్కొన్నారు.