|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:42 PM
గద్వాల జిల్లాలోని ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, మనోపాడు, ఉండవెల్లి మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 700 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు 700 మంది పీఓలు, 859 మంది ఓపీఓలు, మొత్తం 1,559 మంది సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు వెల్లడించారు.