|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 07:25 PM
TG: వరంగల్ (D) పర్వతగిరి(M) శ్రీనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నారం షరిఫ్ వెళ్లి వస్తున్న ట్రాక్టర్, సంగెం(M) తీగరాజుపల్లికి చెందిన ఓ స్కూల్ వ్యాన్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు విద్యార్థులు, ట్రాక్టర్ లో ఉన్నవారు గాయపడ్డారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ఆర్తనాథాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై బి.ప్రవీణ్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వరంగల్ లోని హాస్పిటల్ కు 108 అంబులెన్స్ లలో తరలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ మరియు టాక్టర్ డ్రైవర్ ఇద్దరు మద్యం సేవించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని స్థానిక ఎస్సై తెలిపారు.