|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:02 PM
జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన అంజి రెడ్డి . ఈ కార్యక్రమం లో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి గారు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.. జిన్నారం లో సర్వే నంబర్–1 ప్రభుత్వ భూమిని గుంజుకుని అమ్ముకుని ఇక్కడి నాయకులు కోట్లు సంపాదించి.. పేదల నోట్లో మట్టి కొట్టారు.ఇలాంటి అక్రమాలు చేసిన నాయకులే ఈ మునిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్నారు. ఏ ముఖంతో ప్రజల వద్దకు ఓట్లు అడుగుతున్నారు. శివుని విగ్రహాలు కూల్చినప్పుడు బీజేపీ నాయకులే నెల రోజులు జైలుకు వెళ్లారు.హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదు. జిన్నారం లో అధర్మం.. ధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ధర్మం వైపు ప్రజల కోసం నిలబడే బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.ప్రజల సమస్యల కోసం నిజంగా పోరాడేది, క్రమశిక్షణ, నిబద్దత తో పని చేసేది బీజేపీ నాయకులు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.