|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 02:31 PM
తాను ముస్లిం మతానికి మారడం వల్ల బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 'రోజా', 'బాంబే', 'దిల్‌సే' వంటి చిత్రాలకు సంగీతం అందించినప్పటికీ, తాను ఎప్పుడూ ఔట్‌సైడర్‌లానే భావించేవాడినని తెలిపారు. 'తాల్' చిత్రం పాటలు పంజాబీ, హిందీ మిశ్రమంతో అందరినీ ఆకట్టుకున్నాయని, ఆ తర్వాత సుఖ్‌విందర్ సింగ్‌తో కలిసి చేసిన 'ఛయ్యా ఛయ్యా', 'జై హో' పాటలు గొప్ప విజయం సాధించాయని గుర్తుచేసుకున్నారు. అయితే గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, దీనికి ఇండస్ట్రీలో మారిన పవర్ షిఫ్ట్‌తో పాటు తన మతం కూడా ఒక కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.
Latest News