|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 01:48 PM
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జిగ్రిస్' చిత్రం నవంబర్ 14న విడుదలైంది. థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్‌లలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలో దూసుకుపోతోంది. రెండు మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ట్రెండ్ అవుతూ ఈ చిత్రం ఒక రికార్డును నెలకొల్పింది. కేవలం తెలుగు భాషలో అందుబాటులో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల కుటుంబంతో కలిసి చూసేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల నటన అందరినీ ఆకట్టుకుంది.
Latest News