![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:46 PM
యువతరాన్ని ఆకట్టుకున్న ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారికా సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. ఈనెల 28న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు కథానాయకులు నితిన్, సంగీత్, రామ్. నార్నె నితిన్ మాట్లాడుతూ ‘‘మొదటి భాగంతో పోలిస్తే ఈసారి రెండింతల వినోదంతో వస్తున్నాం. ప్రేక్షకులకు మేము చేసే వినోదం విపరీతంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. మొదటి భాగమంతా కాలేజీలో సాగితే.. ఈ సినిమా ఒక పెళ్లి చుట్టూ సాగుతుంది. దర్శకుడు కల్యాణ్ శంకర్ ప్రతీ సన్నివేశాన్ని కడుపుబ్బా నవ్వుకునేలా తెరకెక్కించారు’’ అని చెప్పారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘‘వినోదమే ఈ సినిమాకు హీరో. ఇందులోని పాత్రలకున్న ప్రధాన ఉద్దేశం నవ్వించడమే. ప్రతీ సన్నివేశం కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. రామ్ నితిన్ మాట్లాడుతూ ‘‘ఇదో క్లీన్ కామెడీ. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తుంది. ‘మ్యాడ్’ సిరీ్‌సను కొనసాగించే ఆలోచన ఉంది’’ అని తెలిపారు.
Latest News