|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 01:58 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 01:20 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సహా కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు.
తెలంగాణ నూతన మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. తెలంగాణ నూతన మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. తెలంగాణ నూతన మంత్రిగా దామోదర్ రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన చేత ప్రమాణం చేయించారు.