|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 03:04 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ప్రగతిభవన్ ఉద్దేశించి మాట్లాడుతూ.. "ప్రగతిభవన్ ఇనుప కంచెలను బద్దలుకొట్టాం. ప్రజలు ఎప్పుడైనా అందులోకి రావొచ్చు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతి రావు పూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తాం." అని పేర్కొన్నారు. దీంతో ప్రగతిభవన్ పేరు జ్యోతి రావు పూలే ప్రజాభవన్‌గా మారినట్లు వెల్లడైంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 01:20 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సహా కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. కొత్త తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా, చరిత్ర పుటల్లో తన పేరును లిఖించిన రెండో వ్యక్తి. ఆయనతో పాటు మరో 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.