|
|
by Suryaa Desk | Sat, Dec 09, 2023, 06:33 PM
నియోజకవర్గం అధికారిక కార్యక్రమం ఏది నిర్వహించినా.. దానికి తన భార్య పిలవాల్సిందేనని ఓ వీడియోను విడుదల చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే, ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఈరోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. దాంతోపాటు.. ఆరోగ్య శ్రీ పథకం పరిధిని రూ. 10 లక్షలకు పెంచుతూ చేయూత పథకాన్ని కూడా అమలు చేస్తున్నారని వివరించారు.
ఈ క్రమంలోనే.. "సంగారెడ్డి నియోజకవర్గ అధికారులంతా నా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అధికారులు ఎవరు కూడా ఆశ్రద్ధ, నిర్లక్ష్యం వహించొద్దు. ఇక నుండి సంగారెడ్డి నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు నా భార్య నిర్మల జగ్గారెడ్డిని పిలవాలి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న. ఆ సమయంలో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేనే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుచుకొని మొదలు పెట్టేవారు. అయినప్పటికీ.. నేను హుందాగా వ్యవహారించాను. ఏమీ అనలేదు అప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని పరిస్థితుల వల్ల నేను ఓడిపోయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నా తరుపున ఇక నుంచి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి నా భార్య నిర్మల అటెండ్ అవుతుంది. అధికారులు నిర్మలకి సమాచారం ఇవ్వాలి. ఆమె సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సంగారెడ్డి నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. అధికారులు ఎవరు అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయొద్దు." అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
"ఈ రోజు సోనియా గాంధీ గారి పుట్టిన రోజు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం. ఇక నుంచి మహిళలు రాష్ట్రంలో ఎక్కడ బస్సులో ప్రయాణం చేసినా టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా వెళ్లిరావొచ్చు . అలాగే ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షలు కూడా అమలు చేయనున్నారు. మిగితా 6 గ్యారెంటీలను కూడా త్వరలోనే ఒక్కొకటిగా అమలు చేస్తాం." జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.