![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 11:47 AM
ఎన్టీఏ ఆధ్వర్యాన నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలకు ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈమేరకు బొమ్మ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, ఎస్బీఐటీ, విజయ ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ పార్వతీరెడ్డి వెల్లడించారు. కాగా, 2, 3, 4, 7, 8, 9తేదీల్లో జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు జరుగుతాయని తెలిపారు.