![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 09:23 PM
సన్న బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంటే, ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలను చింపడం దారుణమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న బియ్యానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే నిధులను అందజేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పినా, ఇవి మోదీ ప్రభుత్వం అందిస్తున్న బియ్యమేనని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బీజేపీ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే, పోలీసుల సహాయంతో వాటిని తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అదే సమయంలో ప్రధానమంత్రి ఫొటోను కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. బియ్యం విషయంలో రాష్ట్రం ప్రభుత్వం వాటా ఎంత ఉందో చెప్పాలని బండి సంజయ్ కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. ఇన్నేళ్లకు ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం మొదలు పెట్టారని అన్నారు.