|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 11:33 AM
మేడే సందర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యలు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ "కార్మికుల దినోత్సవం" వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ . ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ మునిసిపల్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ "కార్మికుల దినోత్సవం" మేడే వేడుకలో పాల్గొన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,మాజీ కార్పొరేటర్ మేకల వెంకటేష్, సీనియర్ నాయకులు నగేష్ చారీ, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు అని, అన్ని రంగాల్లో కార్మికులు ఎనలేని సేవలను అందిస్తున్నారని,కార్మిక సోదర సోదరీమణులకు అందరికీ వందనాలు తెలుపుతూ మరోమారు కార్మిక సోదరులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూనియన్ సభ్యలు దుర్గయ్య,యాదయ్య, మేకల బాలకృష్ణ, శామ్, జీతాయ్య, యేసు రామ్, సురేష్, అంజయ్య, నర్సమ్మ, అమృత, యాదమ్మ,కార్మికు సోదర సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు.