|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 02:00 PM
రామగుండం- 3 ఏరియా పరిధిలో ఏప్రిల్ నెలలో 89 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం సుధాకరరావు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన 5. 75 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 5. 09 లక్షల టన్నులతో 89 శాతం బొగ్గు ఉత్పత్తితోపాటు నిర్దేశించిన 43. 00 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి(మట్టి) వెలికితీత లక్ష్యానికిగాను, 37. 76 లక్షల క్యూబిక్ మీటర్లతో 88శాతం వెలికి తీసినట్లు వివరించారు.ఏడాదిలో నిర్దేశించిన ఉత్పత్తి టార్గెట్ను చేరుకునేలా ప్రణాళికలు వేసి నష్టాలు పూడ్చుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేకే-5, కాసిపేట గనుల్లో రోజుకు16 డ్రిల్స్నడువాల్సి ఉండగా 12 మాత్రమే నడుస్తున్నాయని, దీని వల్ల రోజుకు 520 టన్నుల ఉత్పత్తిని నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఆర్కే ఓసీపీలో మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయని, రెండో ఫేజ్లో 366హెక్టార్ల అటవీ భూమి పర్మిషన్లు రాగానే మళ్లీ ఉత్పత్తి స్టార్ట్చేస్తామన్నారు. సమావేశంలో ఏరియా ఏస్వోటుజీఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏరియా ఇంజనీర్ (ఈఅండ్ఎం) వెంకటరమణ, డీజీఎంలు రాజన్న, ఆర్ వీఎస్ఆర్ కే ప్రసాద్, డీవైపీఎం మైత్రేయ బందు పాల్గొన్నారు.