|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 12:30 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. నియోజకవర్గ పరిధిలోని. వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 101 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన. 40 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, గుమ్మడిదల మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాజు, తదితరులు.