|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 02:35 PM
తెలంగాణలో సోలార్ పవర్ వినియోగంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కీలక విషయాలు చర్చించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సోలార్ పవర్ అప్పగిస్తామని చెప్పారు. వ్యవసాయానికి ఉపయోగపడేలా సోలార్ పవర్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అందించాల్సిందిగా కోరామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రహ్లాద్ జోషీతో భట్టి సమావేశమై మాట్లాడారు.ముందుగా ప్రకటించినట్లుగా 4 వేల మెగా వాట్లు కొనసాగించాలని కోరామన్నారు. అలాగే రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు (ఆర్‌వోఎఫ్‌ఆర్) లభించిన పోడు భూముల్లో సౌర విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కొత్త విద్యుత్ పాలసీలో సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యం ఇచ్చామని సౌర విద్యుత్ పై స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం చేసుకున్నామన్నారు.