|
|
by Suryaa Desk | Wed, May 07, 2025, 01:03 PM
రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని పరిరక్షించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బోధిసత్వ ఫౌండేషన్ అధ్యక్షుడు పులిగిళ్ల వీరమల్లు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఫణిగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బౌద్ధ క్షేత్ర ఆవరణలో కొందరు ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇది బౌద్ధ సంపదకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో నిత్యం పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రం రాష్ట్ర సాంస్కృతిక వారసత్వంలో కీలకమైనదని, దాని సంరక్షణకు అందరూ కృషి చేయాలని వీరమల్లు పిలుపునిచ్చారు.