|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 02:21 PM
తెలంగాణలో బంజారా సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై నిరసనలు ఉధృతమవుతున్నాయి. నేషనల్ బంజారా మిషన్ ఇండియా (ఎన్‌బీఎంఐ) ఈ సమస్యపై చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎన్‌బీఎంఐ అధ్యక్షుడు రవిరాజ్ రాథోడ్‌ను పోలీసులు శుక్రవారం కీసరలోని అతని నివాసంలో ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బంజారా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై బంజారా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ అసంతృప్తి నేపథ్యంలో ఎన్‌బీఎంఐ నిరసన కార్యక్రమాలను ముమ్మరం చేసింది, దీంతో పోలీసులు రవిరాజ్ రాథోడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.