|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 04:13 PM
దివ్యాంగులు, మానసిక వికలత్వంతో బాధపడే చిన్నారులు, రక్తహీనత , ఇతర నరాల వ్యాధులతో బాధపడేవారికి చికిత్స ద్వారా సహాయం చేసేందుకు ముందుకు రావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో కోరారు. బుధవారం ఈసీఐఎల్ కి చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు, హెచ్ ఆర్ మేనేజర్ దుర్గా ప్రసాద్ లు జిల్లా కలెక్టర్ ను తమ చాంబర్‌లో కలిసి సామాజిక బాధ్యత కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిళ్ళు, కృత్రిమ అవయవాలు, వంటివి తాము పంపిణీ చేస్తున్నామన్నారు.