ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 05:09 PM
హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వేగంగా వెళుతున్న రైలులో నుంచి ప్లాట్ ఫాంపై దిగేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. ప్లాట్ ఫాంకు రైలుకు మధ్యలో ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ ప్రయాణికుడికి ప్రాణాపాయం తప్పింది.స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ సంఘటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మను అధికారులు అభినందించారు. కదులుతున్న రైలులోకి ఎక్కడం కానీ, దిగడం కానీ చేయొద్దంటూ ప్రయాణికులను హెచ్చరించారు.