|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 11:00 AM
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో రుద్రసముద్రంకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు తెలిపారు.