|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:52 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు, పలు ప్రాంతాల మధ్య సర్వీసులందించే 16 రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేసింది. జనవరి 7 నుంచి 20వ తేదీ వరకు హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులు ఈ రైళ్లను హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లోనే ఎక్కొచ్చు.