|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:06 PM
ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఎన్ని వేల కోట్లైనా ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.27 వేల కోట్ల చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఉద్యోగుల జీతాలు ప్రతి నెల మొదటి తేదీన జమ చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు.గత ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ప్రతినెలా 15వ తారీకు తర్వాతే వచ్చేవి కానీ మేము అధికారంలోకి రాగానే ప్రతి నెల మొదటి తారీకునే టెన్షనుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం కోటి రూపాయల ప్రమాద బీమా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం ఇవన్నీ నిరంతరం కొనసాగాలి, ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి నడవాలి ఉద్యోగ వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం కోరారు. 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఇటీవల గ్లోబల్ సమ్మెలో విడుదల చేశాం. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందని తెలిపారు.