|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:34 PM
ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఒక కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబునాయక్, ఎస్ఐ ప్రమోద్ ఒక కేసు విషయంలో నిందితుడిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు, నోటీసులు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేసేందుకు లక్ష రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్లాన్ వేశారు.ఫిర్యాదుదారు నుంచి ఆ లక్ష రూపాయల నగదును ఎస్ఐలు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి.