|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 01:56 PM
ఆడబిడ్డల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణకై కేంద్ర ప్రభుత్వం 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో/ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా HPV టీకాను అందిస్తున్న సందర్భంగా.. ఈ రోజు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ అందిస్తున్న తీరును పరిశీలించి అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. గర్భాశయ ముఖ క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 70 వేల మంది మహిళలు మరణిస్తున్నారని. రోజుకు సుమారు 200 మంది, గంటకు 9 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుచూపుతో ఆడపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నారని, సాధారణంగా బయట ఈ టీకా ధర రూ.4,000 పైనే ఉందని, తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ 14 ఏళ్ల వయస్సు గల ఆడబిడ్డలకు ఈ టీకా వేయించి, వారి భవిష్యత్తుకు ఆరోగ్య భరోసా కల్పించాలని కోరడం జరిగింది.