|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:27 PM
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ (Harish Shankar) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో శ్రీలీల ఫీమేల్ లీడ్‌గా నటించగా, రాశీఖన్నా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాకి ఎంత భారీ డోస్ యాక్షన్-స్టైల్ ఉండబోతోందో చూపించింది. తాజాగా మేకర్స్ ముందుగా ప్రకటించినట్టే ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు.“మీరు ప్రేమించిన, గౌరవించిన మరియు విజిల్ వేసిన పవర్ స్టార్ మరోసారి మీ ముందుకు రాబోతున్నారు” అంటూ, మరింత ఎనర్జీతో కూడిన ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి సింగిల్ ప్రోమోను డిసెంబర్ 9 సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ కొత్త స్టైలిష్ లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.“భగత్… భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్‌గంజ్, ఓల్డ్ సిటీ… ఈసారి పర్‌ఫార్మెన్స్ బద్దలైపోతుంది…” అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను 2026 మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Latest News