|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:42 PM
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ వేదికపై దివంగత నటుడు ధర్మేంద్రను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. షోలో భాగంగా ఇటీవల మరణించిన ధర్మేంద్రకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత, గతంలో ధర్మేంద్ర బిగ్ బాస్ షోకి వచ్చినప్పటి వీడియోను ప్రసారం చేయగా, దాన్ని చూసి సల్మాన్ తన ఆవేదనను ఆపుకోలేకపోయారు. చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశారు.ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, "మనం హీమ్యాన్‌ను కోల్పోయాం. ఆయన కంటే గొప్ప నటుడు లేరని నేను భావిస్తున్నా. మిస్ యూ ధర్మేంద్ర జీ. నా పుట్టినరోజు నాడే మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నన్ను మరింత బాధించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News