|
|
by Suryaa Desk | Sun, Jan 18, 2026, 11:37 PM
Champion OTT Release Date: స్వప్న సినిమాస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘Champion’. రోషన్ మేకా హీరోగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు.తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి చాంపియన్ స్థాయి హిట్‌గా నిలిచింది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. Netflix ఈ చిత్రానికి ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ సినిమా జనవరి 23 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఈ విషయం కోసం చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Champion కథ:కథ ప్రధానంగా సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్ (రోషన్) చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడో ఇంగ్లాండ్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటూ, ఫుట్‌బాల్‌లో చాంపియన్ అవ్వాలని తాను భావిస్తున్నాడు. కానీ ఇంగ్లాండ్ వెళ్లడానికి అవకాశం వచ్చిన సమయంలో, అతని తండ్రి చేసిన పని అతనికి పెద్ద అడ్డంకిగా మారుతుంది.ఇది అధిగమించడానికి, మైఖేల్ తుపాకులు ఉన్న ఒక ట్రక్క్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా అతను బైరాన్‌పల్లి గ్రామానికి చేరుతుంది. అక్కడ మైఖేల్ ఆ తుపాకులను సురక్షితంగా డెలివరీ చేస్తాడా? తండ్రి అడ్డంకిని ఎలా ఎదుర్కొన్నాడు? బైరాన్‌పల్లిలో అతని జీవితం ఎట్లా మారింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, సినిమాను చూడాల్సిందే.