|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:50 PM
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దండోరా’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ఎంతో లోతైన, శక్తిమంతమైన, ఆలోచింపజేసే చిత్రమని కొనియాడారు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన పంచుకున్నారు.“ఇప్పుడే దండోరా సినిమా చూశాను. ఇంతటి బలమైన రచనతో, మన మూలాలకు దగ్గరగా ఉండే కథను ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్ గారికి నా హ్యాట్సాఫ్” అని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. ఇంత మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహించిన నిర్మాత రవీంద్ర బెనర్జీకి, చిత్ర బృందానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Latest News