![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 11:58 AM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియూ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా రూపొందుతుంది. ఈ సినిమా RC16 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి AR రహమాన్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఆర్సీ16 చిత్రానికి 'పెద్దీ' టైటిల్ ను ప్రకటించారు. అలాగే ఉత్సుకతను రేకిత్తించేలా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. టైటిల్ క్యాచీగా ఉండటంతో సినిమాపై రీచ్ ను పెంచేస్తోంది. మరోవైపు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉండటం విశేషం. ఊరమాస్ లుక్ లో రామ్ చరణ్ దర్శనమిచ్చి సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అమాంతం ఆకాశానికి ఎత్తేశారు.
పెద్ది.. చిత్రం నుంచి రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. మొదటి పోస్టర్ లో టైటిల్ ను రివీల్ చేస్తూ రామ్ చరణ్ పవర్ ఫుల్ కళ్లను చూపించారు. చుట్టా కాల్చుతూ, గంభీరంగా చూస్తూ కనిపించాడు. ఆ కళ్లలో తను నటించే పాత్ర ఎంత శక్తివంతమైనదే తెలిసిపోతోంది. ఎవరికీ భయపడని తత్వం, ఎలాంటి పరిస్థితినైనా నెగ్గే నేర్పు, పట్టుదల కనిపిస్తున్నాయి. మరోవైపు లాంగ్ హెయిర్, భారీ గడ్డంతో రామ్ చరణ్ ఊరమాస్ లుక్ ను సొంతం చేసుకున్నారు. మరోసారి రంగస్థలాన్ని గుర్తు చేసినట్టు కనిపించింది. కానీ మరో పోస్టర్ లోని రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కొత్తదనాన్ని చూపించింది. పూర్తిగా తన పాత్ర తాలుకూ లక్షణాలను తెలియజేస్తూ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్ ను పెంచేస్తోంది.
#RC16 is #Peddi.
A @BuchiBabuSana film.
An @arrahman musical.@NimmaShivanna #JanhviKapoor @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/fuSN5IjDL1
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2025