![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 11:15 AM
మ్యాడ్ స్క్వేర్ సినిమా ఆడియో ఈవెంట్ కార్యక్రమంలో యంగ్ హీరో నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ, “మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ, ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్ గా ఉన్నప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్ షిప్ ని స్ట్రాంగ్ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాయి. మ్యాడ్ లాంటి సినిమాలు రావడం సంతోషంగా ఉంది. మ్యాడ్ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు స్టార్స్ అయిపోయారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా వీళ్ళ పేర్లను గుర్తు పెట్టుకుంటారు. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నె నితిన్, రామ్, సంగీత్ లో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. ఒక స్టోరీ డిస్కషన్ లో దర్శకుడు కళ్యాణ్ తో కూర్చున్నప్పుడు ఆయన నేరేషన్ కే పడిపడి నవ్వాను. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించగలను. నా ఫేవరెట్ డీఓపీ శామ్‌దత్ గారు ఈ సినిమాకి పనిచేశారు. నిర్మాతగా హారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నాది, నాగవంశీ జర్నీ ప్రేమమ్ తో మొదలైంది. తన ధైర్యమే నాగవంశీని ఇంతదూరం తీసుకొచ్చింది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. అలాగే నిర్మాత చినబాబు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. మ్యాడ్ స్క్వేర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మ్యాడ్ 2 మాత్రమే కాదు, మ్యాడ్ 100 కూడా రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.
Latest News