![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 10:57 AM
సంగారెడ్డి మండలం ఈశ్వరపురంలోని సప్త ప్రాకారహిత దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.