![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:08 AM
కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయుల కుటుంబాలను పీఆర్టీయూ సంక్షేమ నిధి ద్వారా ఆదుకుంటామని వీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన దుంపలపల్లిలోని జడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు అశోక్ కుటుంబానికి శుక్రవారం రూ. లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు మరణిస్తే వెంటనే సంక్షేమనిధి నుంచి లక్ష రూపాయలు అందజేస్తామన్నారు.