![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 04:12 PM
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అసూయ, ద్వేషం, ఆశ కారణమైనట్లు ఓ సింగర్ చెప్పినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.ఈ మూడింటి వల్లే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయిందని ఆ సింగర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ కాలేజీలు, దామరచర్ల విద్యుత్ ప్లాంట్, యాదాద్రి ఆలయంతో పాటు ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాం కదా.. ఎందుకు ఓడిపోయామని ఓ సింగర్‌తో అంటే.. ఆయన ఇలా సమాధానం చెప్పారు. రామాయణంలో కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్టు సింపుల్‌గా చెప్తా అని ఇలా చెప్పిండు.. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోవడానికి అసూయ, ద్వేషం, ఆశ పని చేశాయని చెప్పిండు. అసూయ అంటే అధికార పార్టీలోకి రాగానే ఎమ్మెల్యేలు కొత్త కారు, కొత్త ఇల్లు కట్టుకున్నాడని ప్రచారం చేశారు. ఇది వరకు అంగి లేకుండా తిరిగినట్టు ఇవాళ కొంత మంది నాయకులు కొత్త అంగి వేసుకున్నట్టు అసూయ పడ్డారు. మరో వైపు ద్వేషం..ఈ రాష్ట్రాన్ని కుటుంబం కోసం తెచ్చినట్టు.. దొర పాలన అని ప్రజల్లో ద్వేషం నిండే విధంగా అగ్ర నాయకత్వంపై ప్రచారం చేశారు. ఇక ఆశ.. కేసీఆర్ పదివేలు ఇస్తుండు.. నేను పదిహేను వేలు వేస్తా.. ఇద్దరికీ పెన్షన్లు ఇస్తా అని ఆశ పెట్టిండు. ఎతుల వెంకట్ రెడ్డి, కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టి మోసం చేశారు. కాంగ్రెసోడు, బీజేపోడు అభివృద్ధి గురించి మాట్లాడలేదు. మెడికల్ కాలేజీ, ఎస్పీ ఆఫీసు గురించి మాట్లాడలేదు. కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీల గురించి చెప్పలేదు. అసూయ, ద్వేషం, ఆశ నింపి ఓడగొట్టారు అని ఆ సింగర్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.
కేసీఆర్ హయాంలో భూముల ధరలు పెరిగాయి. దాంతో అందరి సంపద పెరిగింది. టీఆర్ఎస్ సంపద పెరగొద్దు.. కానీ కాంగ్రెస్, బీజేపీ సంపద పెరగాలట. కేసీఆర్ దొర అని యూట్యూబ్‌లో పనికిమాలిన చెత్త మాట్లాడి తిట్టని తిట్లు తిట్టి విషప్రచారం చేసి అధికారంలోకి వచ్చిండు. ఇవాళ అదే యూట్యూబ్ వాళ్లను గుడ్డలుడదీసి కొడుతాడట. ఆయన కాడికి వస్తే అన్ని గుర్తుకు వస్తున్నాయి. ఇదివరకు ఎవరికి భార్యాలు పిల్లలు లేరట. ఈయనకు మాత్రమే ఉన్నారట. నాయకులను నీచంగా వికృతంగా మాట్లాడి.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.