![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 04:21 PM
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో వంట పాత్రల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ క్రమంలో పిల్లలతో టీచర్లు కుర్చీలను మోయించారని తల్లితండ్రులు మండిపడ్డారు. స్కూళ్లో భోజనం సరిగా ఉండడం లేదని పిల్లలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయారట ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ తరుణంలోనే… పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. మధ్యాహ్న భోజన పథకానికి వంట సామాగ్రి పంపిణీ చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారట..