![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 08:33 PM
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి సందర్భంగా 26 స్పెషల్ వీక్లీ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ప్రకటించింది. సమ్మర్ నేపథ్యంలో అనేక మంది హాలీడే ట్రిప్పుల కోసం ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు స్పెషల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ట్రైన్స్ వివరాల కోసం ఐఆర్‌సీటీసీ యాప్‌ను చూడాలని పేర్కొంది.ఆయా రోజుల్లో రైలు ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.40గంటలకు గమ్యస్థానం చేరుతుందని చెప్పుకొచ్చింది. రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చర్లపల్లి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, తిరువన్నామలై, విల్లుపురం, తిరుప్పాడిరిపులియూర్, చిదంబరం, మైలాదుత్తురై, కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండిగుల్, కొడైకెనాల్ రోడ్, మధురై, విరుదునగర్, సాతూర్, కోవిల్‌పట్టి, తిరునల్వేలి, వల్లియూర్, నాగర్‌కోయిల్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.