![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 08:46 PM
తెలుగు రాష్ట్రాల్లోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తుండడంతో ప్రజలు వీలైనంతవరకు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళితే ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. వృద్దులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ORS, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని అంటున్నారు.